సోషల్ మీడియా యుగంలో స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఫేమస్ అయ్యాయి. ఏదైనా వంటకంలో కాస్త రుచికి కొత్త పదార్దం జోడిస్తే చాలు.. వెంటనే వీడియో తీయడం.. ఫేస్ బుక్... ట్విట్టర్.. ఇన్స్ట్రాలో పోస్ట్ చేయడం జనాలకు సరదా అయిపోయింది. అవే కాదు.. బజార్లలో టీ దుకాణం వారు ఏదో రకంగా ఇంటర్నెట్ లో పాపులర్ అవుతున్నారు. జనాలు తిడుతున్నా సరే .. వారు ఏం పట్టించుకోవడం లేదు.. ఇప్పుడు అలానే ఓ టీ షాపు యజమాని పెప్సీతో టీ తయారు చేసి .. సొషల్ మీడియాలో పోస్ట్ చేసి ..జనాలకు టీ అంటే విరక్తి పుట్టించాడు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నలుగురు కలిస్తే చాలు సరదాగా టీ షాపునకు వెళ్లి టీ తాగుతారు. తేయాకు టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, కోల్డ్ టీ, చమోమిలే టీ, మూలికల టీ, మసాలా టీ, ఇరానీ చాయ్, లెమన్‌గ్రాస్ టీ.. చివరికీ తందూరీ టీ గురించి కూడా మీరు వినే ఉంటారు. కాని ఇప్పుడు వెరైటీగా పెప్సీతో తయారు చేసిన టీ ని ఎప్పుడైనా చూశారా.. తాగారా..లేదా.. అయితే ఈ వీడియో చూడాల్సిందే...కొన్ని టీ దుకాణాల్లో రుచి.. వాసన అదిరి పోతుంది. అక్కడ టీ తాగేందుకు జనాలు క్యూ కడగారు. కాని ఈ వీడియోలో ... రోడ్డు పక్కన దర్జాగా టీ దుకాణం పెట్టిన ఓ వ్యాపారి టీ తయారు చేసిన విధానం చూసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు. అసహ్యంతో వాంతి చేసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకైనా మంచిది టీ ప్రియులకు ఇది కొంచెం భీతి గొలిపే విషయం.. ఇంతకూ ఆ టీని ఎలా తయారు చేశాడంటే...
టీ అంటే ఇష్టపడని వారు దాదాపు ఉండరు. ఘుమఘుమలాడే వేడి వేడి టీని ఓ కప్పు తాగితే వచ్చే మజా అంతాఇంతా కాదు. ఇక బయటికి వెళ్లినప్పుడు రోడ్డు పక్కన దుకాణాల్లో సువాసనలు వెదజల్లే టీ తాగి తరిస్తుంటారు కొందరు టీ ప్రేమికులు. అయితే మీరిప్పటి వరకూ.. తేయాకు టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, కోల్డ్ టీ, చమోమిలే టీ, మూలికల టీ, మసాలా టీ, ఇరానీ చాయ్, లెమన్‌గ్రాస్ టీ.. చివరికీ తందూరీ టీ గురించి కూడా మీరు వినే ఉంటారు. కానీ వెరైటీగా పెస్పీతోనో.. కొకొకోలాతోనో ఎప్పుడైనా టీ తయారు చేశారా? పోనీ .. కనీసం తాగారా? మీ సమాధానం ‘నో’ మీరు తప్పనిసరిగా ఈ వీడియో చూడాల్సిందే.
ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పక్కన దుఖాణంలో టీ తయారు చేయడం కనిపిస్తుంది. ఇంతకు ముందే టీ తయారు చేసిన ఓ పాత్రను కడగకుండా.. స్టవ్‌పై పెట్టి.. అందులో పాల ప్యాకెట్స్ కట్ చేసి పాలు పోయడం కనిపిస్తుంది. ఆ తర్వాత కొన్ని నీళ్లను ఈ పాత్రలో పోస్తాడు. టీ ఆకు రెండు, మూడు స్పూన్లు వేసేస్తాడు. ఇందంతా టీ తయారు చేసేటప్పుడు సహజమే అయినా... ఆ తర్వాతే అసలు సీన్ మొదలైంది. చేతిలోకి ఓ పెప్సీ బాటిల్ తీసుకుని, దాని మూత తీసి టీ పాత్రలో పెస్సీ మొత్తం ఒలకబోస్తాడు. అనంతరం బాగా మరిగించి పాత్రను గుండ్రంగా ఓ సారి తిప్పేస్తాడు. అంతే టీ తయారై పోయినట్లుంది.. వెంటనే రెండు పేపర్ గ్లాసులు తీసుకుని, ఒడకట్టి టీ గ్లాసుల్లో నింపేస్తాడు. వాటిని తీసుకుని ఎదురుగాఉన్న కస్టమర్లకు సర్వ్ చేశాడు.
ఈ వింత టీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెప్సీతో తయారు చేసిన విచిత్రమైన టీ వీడియోలో ఓ సినిమా ఫన్నీ డైలాగ్‌ను కూడా జోడించేశారు. వీడియో ప్రారంభంలో టీ ప్రియులను ఆకట్టుకునేలా క్యాజువల్‌గా చూపించినా.. ఈ వీడియో క్లిప్‌లోకి కొన్ని సెకన్లు టీ ప్రియుల హృదయాలను ముక్కలు చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు నవ్వుల ఎమోజీలతో కామెంట్లు చేస్తుంటే.. మరికొందరేమో సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు.. ‘Thuuuuu (Ewwww)’ అంటూ తమ అయిష్టాన్ని వ్యక్తం చేశారు.